తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై మున్సిపల్ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామని సీఎం చెప్పారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉంది. టికెట్లు రాని వారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.