ది వాల్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ నేటితో నలబై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఏడో వసంతంలోకి అడుగుపెట్టాడు.
1996లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ద్రావిడ్ తొలిరోజుల్లో మొదట అతని ఆట శైలీపై ఎన్నో విమర్శలు చేసేవారు. జిడ్డు అని కూడా చాలా మంది హేళన చేసేవారు కూడా.
అయితే ఏ మాత్రం నిరాశ చెందని రాహుల్ ద్రావిడ్ అనతికాలంలోనే టీమిండియాకు ఎనలేని విజయాలను అందించి అందరిచేత వహ్వా అన్పించుకున్నారు.2012లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు ద్రావిడ్. ద్రావిడ్ పుట్టిన రోజు సందర్భంగా అతని గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం..
* ద్రావిడ్ ను జామీ అని కూడా పిలుస్తారు
*ఆటలోనే కాదు చదువులో కూడా ద్రావిడ్ మెరిట్
* ద్రావిడ్ ఎంబీఏ వరకు చదివాడు
* ఇంగ్లాండ్ తో ఆడిన మొదటి టీ20యే అతనికి చివరి మ్యాచ్
* ఇండియాకు ఆడకముందు స్కాట్లాండ్ తరపున పదకొండు మ్యాచులు ఆడాడు
* 2004లో సెక్సీయేస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ గా ఎంపికయ్యాడు
* టీనేజ్లో హాకీ ,క్రికెట్ రెండూ ఆడేవాడు
*టెస్టు క్రికెట్ ఆడే అన్ని దేశాలపై ద్రావిడ్ సెంచురీ చేశాడు