Home / SLIDER / రైతుబంధుకు రూ. 5100 కోట్లు మంజూరు

రైతుబంధుకు రూ. 5100 కోట్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం అన్నదాతకు పంట పెట్టుబడి అందిస్తున్న రైతుబంధు పథకానికి వ్యవసాయ శాఖ నిధులు మంజూరు చేసింది. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 5100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేసింది.

 
2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు పథకానికి రూ. 12,862 కోట్లు కేటాయించగా… ఖరీఫ్‌లో రూ. 6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తాజాగా.. రబీలో అందించేందుకు రూ. 5100 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
 
ఈ మేరకు ఆర్ధిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా, వ్యవసాయ శాఖ పరిపాలనా అనుమతులు ఇస్తూ.. ఉత్వర్వులు జారీ చేసింది. నిధుల మంజూరుకు సంబంధించి పరిపాలనా అనుమతులు రావడంతో… వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్ధిక శాఖకు అందివ్వనుంది. రైతుల వివరాలు అందిన వెంటనే.. ఆర్థిక శాఖ ఆ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది.