Home / SLIDER / టీజేఎస్ ఖాతాలోఒకే ఒక్క వార్డు

టీజేఎస్ ఖాతాలోఒకే ఒక్క వార్డు

తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఏడాది కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన తెలంగాణ జనసమితి పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులు ఒక్క చోట కూడా డిపాజిట్ తెచ్చుకోలేకపోయిన కానీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక్క వార్డును దక్కించుకుంది.

జిల్లా పరిషత్,పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది ఈ పార్టీ. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకే ఒక్క వార్డును తెలంగాణ జనసమితి పార్టీ దక్కించుకుంది.

అక్కడ ముప్పై నాలుగో వార్డు నుండి బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి సోమశేఖర్ గెలుపొందారు.