Home / MOVIES / ఆర్జీవీ మరో సంచలనం..?

ఆర్జీవీ మరో సంచలనం..?

ప్రముఖ వివాదస్పద సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దిశ సంఘటన దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసులో కలిశారు.

ఈ సందర్భంగా దిశ సంఘటన పూర్వపరాలను అడిగి మరి తెలుసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై తాను సినిమా తీయబోతున్నట్లు.. ఈ మూవీ తర్వాత మహిళలను రేప్ చేయాలంటే భయపడతారు అని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా ఆర్జీవీ గురించి మరో వార్త సోషల్ మీడియా అండ్ ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదే ఆర్జీవీ చెన్నకేశవుల భార్య అయిన రేణుకకు బ్లాంక్ చెక్ ఇచ్చాడు అని. రేణుక తనకు తన భర్త చేసిన అన్యాయం,దిశకు చేసిన అన్యాయం గురించి వివరించడంతో చలించిపోయిన ఆర్జీవీ రేణుకకు తనకిష్టమైనంత రాసుకోమని చెప్పి బ్లాంక్ చెక్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్జీవీలో ఈకోణంపై ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.