ప్రముఖ హీరో నిఖిల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో శనివారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య నిఖిల్, పల్లవిల నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఏప్రిల్ 16న ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నట్టుగా సమాచారం. దీంతో పలువురు సినీ ప్రముఖులు నిఖిల్‌కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే పల్లవి వర్మకు నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. నిఖిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఓ డాక్టర్‌ను ప్రేమిస్తున్నానని చెప్పిన సంగతి తెలిసందే. కాగా, టాలీవుడ్‌లో డిఫరెంట్ మూవీస్‌తో నిఖిల్ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన అర్జున్ సురవరం చిత్రం మంచి విజయాన్ని సాధించింది.