టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్రహీరో .. మన్మధుడు అక్కినేని నాగార్జున అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. ప్రస్తుతం మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా సొగ్గాడే చిన్ని నాయనా మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానున్నది.
మరోసారి ఈ చిత్రంలో నాగ్ కామెడీ పంచనున్నాడు. ఉగాది రోజున ఈ చిత్రం ప్రారంభించాలని చిత్రం యూనిట్ భావిస్తోంది. బంగార్రాజు లో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా నటించే అవకాశముంది. ఈ సినిమాను కూడా కళ్యాణ్ కృష్ణనే దర్శకత్వం వహిస్తోన్నాడు.