అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలిపోదని ఇప్పటివరకూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా రూ.13 వేల 500 కోట్లతో ఒక ఫ్యాక్టరీని స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా వెళ్లి పోతుందో ఎవరికీ అర్ధం కాలేదు.. అయితే కియా ఫ్యాక్టరీపై ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తోందని ప్రజలందరికీ అర్ధమయ్యింది. అసత్య కథనాల ఆధారంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం చేస్తున్నారని. ఏదో జరిగి పోతుందంటూ ఎల్లో మీడియాలోనూ కథనాలివ్వడం చాలా దారుణంగా కనిపిస్తోంది, ఫ్యాక్టరీని తరలించే యోచనేలేదని కియా యజమాన్యం ప్రకటించిన తర్వాత కూడా ఈ చర్చ అనవసరం అయినా టీడీపీ ఈ తరహా దుష్ప్రచారాలు సాగిస్తోంది. కొందరు చదువుకున్న బుద్ధిలేని మూర్ఖులు కూడా ఈ విషయం వాస్తవమో కాదో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మరింత దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.1 బిలియన్ డాలర్లతో ఏర్పాటైన కియా కార్ల కంపెనీ తన యూనిట్ ప్రారంభించి రెండు నెలలు కాకముందే తమిళనాడుకు తరలిపోతోందంటూ ఓ మీడియా అసత్య కథనం వెలువడించింది. వెంటన్నీ దీన్ని పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎల్లో మీడియా కియా పరిశ్రమ వెళ్లిపోతుందంటూ ప్రచారం మొదలెట్టింది. అయితే ఆ వార్తల్నీ వట్టి పుకార్లేనని తేట తెల్లమవడంతో ఈ దుష్ట్రచారానికి పాల్పడినవారంతా కిమ్మనడంలేదు.
