నాలుగేళ్లుగా షాలిని అనే అమ్మాయిని ప్రేమిస్తున్న నితిన్, తన ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడంతో వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇంకేముందు..ఈ ఏడాది ఏప్రిల్ 15 న నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడట.
దానికి కారణం సినిమాలే. తన సినిమా పనుల్లో బిజీగా ఉండే సమయంలో పెళ్లి చేసుకోవడం నచ్చని నితిన్, ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి పెళ్లిని ఏప్రిల్ లో కాకుండా మార్చ్ లో పెట్టుకోవాలని చెప్పాడట.