బిల్ గ్రేట్స్ మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు. ప్రస్తుతం వరల్ద్ లోనే అత్యంతధనవంతులైన వారిలో రెండో వాడు. అంతటి ధనవంతుడైన బిల్ గ్రేట్స్ సూమారు 370అడుగుల పొడవు.. ఐదు డెక్ లు.. పద్నాలుగు మంది అతిథులు.. ముప్పై ఒకటి మంది సిబ్బంది ప్రయాణించడానికి వీలుగా ఉన్న సూపర్ యాచ్ అనే పడవను కొనుగోలు చేశారు.
ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే ప్రపంచంలోనే ఏకైక బోటు ఇదే కావడం విశేషం.ఇందులో ఒక జిమ్ ,యోగా చేయడానికి స్టూడియో,బ్యూటీ రూం,మసాజ్ పార్లర్,స్విమ్మింగ్ పూల్ తదితర సదుపాయాలు ఉన్నాయి.
మరి ఇంత ఉన్న దీని ధర ఎంతో తెలుసా.. దీని ధర అక్షరాల నాలుగు వేల ఆరు వందల కోట్లు. అయితే ఈ పడవ లిక్విడ్ హైడ్రోజన్ తో నడవడం వలన కేవలం నీటిని మాత్రమే వ్యర్థంగా సముద్రంలోకి వదులుతుంది.