ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. తన మొదటి సినిమాలో తన నటనతో మంచిపేరు తెచ్చుకుంది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటినుండి అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. ఎంత మంచి అవకాశాలు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే అంత. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన నటించిన.ఇప్పుడు తాజాగా భీష్మ సినిమాలో నితిన్ సరసన నటిస్తుంది. అయితే మనందరికీ తెలిసిన ఆమె మనతో పంచుకున్న విషయం దళపతి విజయ్ తో సినిమా చెయ్యాలనే తన కోరిక. అయితే ఇక అసలు విషయానికి సినిమా విషయం పక్కనపెడితే విజయ్ పై తనకి వేరే ఉద్దేశాలు ఉన్నాయని తెలిసింది. భీష్మ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ మీరు లవర్ గా ఎవరిని అనుకోగలరు అంటే వెంటనే విజయ్ అని చెప్పేసింది. మరి పెళ్లి అనే విషయానికి వస్తే అప్పుడే అలాంటి ఆలోచన లేదుగాని లవర్ విజయ్ అయితే పెళ్లి కూడా మీరు ఆలోచించండి అన్నట్టు సమాధానం చెప్పింది.
