మెగా కాంపౌండ్ హీరో.. వరుణ్ తేజ్ తనను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ముకుంద సినిమాతో పరిచయం చేసిన తన తొలి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథను హీరో వరుణ్ తేజ్ కు విన్పించాడు. కథ నచ్చడంతో వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ తో నారప్ప చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తవ్వగానే వీరిద్దరి సినిమా పట్టాలెక్కనున్నది. అయితే దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.