ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బాటలో నడవనున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న రాజధాని వికేంద్రీకరణ ఆలోచన ప్రభావం కర్ణాటక రాష్ట్రంపై పండింది. దీంతో ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం బెంగళూరు నుండి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది.
ఇందుకు బీజేపీ అధిష్ఠానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రక్రియకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఉత్తర కర్ణాటక రాష్ట్ర ప్రజల ప్రయోజనలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కార్యాలయాలను తరలించాలని నిర్ణయించినట్లు మంత్రి ఈశ్వరప్ప తెలిపారు.