Home / ANDHRAPRADESH / సీఎం జగన్ ను కల్సిన నిర్మాతలు

సీఎం జగన్ ను కల్సిన నిర్మాతలు

ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహన్ రెడ్డిని నిన్న బుధవారం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా బడా కొంద‌రు నిర్మాత‌లు క‌లిశారు. డి.సురేశ్‌బాబు, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, కిర‌ణ్, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి స‌హా మ‌రికొంద‌రు నిర్మాత‌లు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో క‌లిశారు.

అప్పటి ఉమ్మడి ఏపీలో 2014లో వచ్చిన హుదూద్‌ తుఫాను కార‌ణంగా విశాఖ న‌గ‌రానికి భారీ న‌ష్టం వాటిల్లిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మయంలో టాలీవుడ్ అంతా క‌లిసి దాదాపు 15 కోట్ల రూపాయ‌ల విరాళాల‌ను సేక‌రించి బాధితుల‌కు ఇళ్లు నిర్మించి ఇచ్చారు.

ఆ ఇళ్ల‌ను ప్రారంభించాల‌ని సీఎం జ‌గ‌న్‌ని క‌లిసిన‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే ఆ ఇళ్ల‌ను ప్రారంభిస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు కూడా వారు ఈ సందర్భంగా తెలిపారు.