కరోనా వైరస్‌తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతున్న విషయం అందరికి తెలిసిందే. దాంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. స్కూల్స్, మాల్స్, పార్కులు అన్నీ మూసివేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా ఎలాంటి షూటింగ్ లు ఉన్నా తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను లెక్క చేయకుండా ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్ర షూటింగ్ జార్జియాలో చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మూడు నెలల క్రితమే అనుకోవడంతో దీనిని షూట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి కేసులు లేవు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కాని వారిని చూస్తుంటే ఎటువంటి భయం లేకుండా భాద్యత లేకుండా ఉన్నారని తాజాగా పూజా హెగ్డే పిక్ ఒకటి చూస్తుంటే తెలుస్తుంది. షూటింగ్ లో భాగంగా పూజా మంచు ఎక్కువగా ఉండే లొకేషన్ లో స్టిల్స్ ఇచ్చి పిక్ తీసుకుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ మేరకు పూజాపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు.