అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలంగాణలో ఫేమస్ కమెడియన్ బిత్తిరి సత్తిపై సంచలన కామెంట్స్ చేసింది. అదేమిటంటే అతడికి తను పెద్ద ఫ్యాన్ అని చెప్పింది. ఇదంతా యావత్ టీవీ ప్రేక్షకుల ముందే చెప్పింది. ఇక అసలు విషయానికి వస్తే మార్చి 22న ఉగాది సందర్భంగా జీ తెలుగులో బాబు ఇంట్లో బుట్ట భోజనం అనే ప్రోగ్రామ్ రాబోతుంది. ఈ మేరకు రిలీజ్ అయిన ప్రోమోలో అనుష్క స్పెషల్ గెస్ట్ గా వస్తుంది. ఇందులో భాగంగానే బిత్తిరి సత్తిని నేను మీకు పెద్ద ఫ్యాన్ అని అంటుంది.