Home / 18+ / మొదటిసారి తన అభిమానులను బ్రతిమిలాడిన రాంచరణ్..ఎందుకంటే !

మొదటిసారి తన అభిమానులను బ్రతిమిలాడిన రాంచరణ్..ఎందుకంటే !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటిసారి తన అభిమానులు ముందుకు వచ్చి బ్రతిమిలాడాడు. ఇంతకు ఆ హీరో అలా ఎందుకు చేసాడు అని అనుకుంటున్నారా. దానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేమిటంటే ఈ నెల 27న రాంచరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా తన అభిమానులను ఒక కోరిక కోరాడదు. అది ఒక లెటర్ రూపంలో రాసాడు. ఇంతకు ఆ లెటర్ లో ఏముంది అంటే..” మీకు నా మీద ఉన్న ప్రేమ మరియు నా పుట్టిన రోజుని పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. ఇలాంటి సందర్భంలో మనం సాధ్యమైనంత వరకు జనసాంద్రత తక్కువ గా ఉండేట్టు చూస్కుంటూ ఉండటం మంచిది. ఇది మనసులో పెట్టుకుని ఈ సంవత్సరం నా పుట్టిన రోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా నా మనవి.మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ ( covid19 ) వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకి అర్ధమయ్యే విధంగా తెలియజేసి మీ వంతు సామాజికబాధ్యతని నెరవేర్చితే అదే నాకు ఈ సంవత్సరం మీరు ఇచ్చే అతి పెద్ద పుట్టిన రోజు కానుక. నా ఈ మనవిని మీరంతా సహృదయంతో స్వీకరించి పాటిస్తారు అని ఆశిస్తున్నాను” అని రాసారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat