”కరోనా” ఈ పేరు చెప్తే చాలు నేడు ప్రపంచమే గడగడలాడిపోతుంది.మానవ మనుగడను ప్రశ్నిస్తున్నది కరోనా వైరస్.ఎంతో బలమైన దేశాలు సైతం ఈ వైరస్ బారినపడి కకావికలం అవుతున్నాయి.చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకి విస్తరిస్తూ వైద్య రంగానికి సవాల్ గా నిలుస్తుంది.మందులేని రోగం కావడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రపంచ దేశాలు నేడు గడగడలాడుతున్నాయి..కరోనా వైరస్ విషయంలో నిర్లక్యానికి మూల్యం ఎలా ఉంటుందో నేడు ఇటలి,అమెరికాల ను చూస్తే అర్దం చేసుకోవచ్చు.. మెల్లమెల్లగా ఈ వైరస్ బారత్ కు ప్రవేశించింది..
మెల్లమెల్లగా ఇండియాలో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి..వాటి వేగం తగ్గించగలిగితే బారత్ భవిష్యత్ లో మనుగడ సాదించగలదు..అలా జరగాలంటే ప్రభుత్వం ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే..లేదంటే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు..
మరి దీని నియంత్రణ ఎలా..? మందు లేని రోగం ఎట్లా పోతుంది..? దీన్ని వ్యాప్తి చెందకుండా అరికట్టలేమా..? ఇవి మనముందున్న ప్రదాన ప్రశ్నలు..వాటికి సమాదానాలు మనదగ్గరే ఉన్నయ్..దాన్ని అరికట్టే శక్తి సైతం మన చేతుల్లోనే ఉంది..మనం కత్తులు పట్టుకుని యుద్దాలు చేయాల్సిన అవసరం లేదు..బార్డర్లో నిలుచుని బాంబులు విసరాల్సిన అవసరం లేదు..చేయాల్సిందల్లా ఒక్కటే మనల్ని మనం స్వియ నిర్బందం పాటించడం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు,ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు దేశంలో, రాష్ట్రంలో మార్చి 22 న లాక్ డౌన్ ప్రకటించారు..తదనంతర పరిస్థితుల దృష్యా ఏప్రిల్ 14 వరకు అంటే 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలెవరూ భయటకు రావద్దని ప్రార్థించారు..కానీ చాలామంది బాద్యతమరిచి విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నారు..మనకు ఇది చిన్నపాటి నిర్లక్షమే కానీ దాని మూల్యం నీ ఒక్కడితో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళపై,వాళ్ళ ద్వారా రాష్ట్రం,దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..
నిర్లక్ష్యానికి బారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.ఇటలీ బలలైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం,అమెరికా ప్రపంచానికే పెద్దన్న కానీ నేడు కరోనా వైరస్ విషయంలో ఎక్కువ బాదితులైన దేశాలు ఈ రెండే..కరోనా వైరస్ పుట్టిన చైనాను ఈ రెండు దేశాలు మించిపోయాయి..ఇందుకు కారణం లేకపోలేదు.స్వియనియంత్రణలో వాళ్ళు ఫేయిల్ అయ్యారు.అక్కడ ప్రభుత్వాలు,దేశాదినేతల పిలుపులను గౌరవించకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చారు.దీంతో నేడు వారి దేశాలలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నమైంది.మరణాల సంఖ్య పెరుగుతుంది.దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు ఆ దేశాలు పడ్డాయి..
ఇటలీ జనాబా 6 కోట్లు ఇండియా జనాబా 130 కోట్ల పైమాటే.. 6 కోట్ల ప్రజలు నియంత్రణ పాటించకుంటే ఆస్థాయిలో నష్టం జరిగితే 130 కోట్ల పైచిలుకు ఉన్న జనాబా కలిగిన మన దేశంలో నష్టం ఏ విదంగా ఉంటుందో ఊహించడానికే భయంకరంగా ఉంది..కాబట్టి స్వియ నిర్బందమే మనకు శ్రీరామరక్ష మనల్ని కరోనా నుండి కాపాడేది మన క్రమశిక్షణ,స్వియనిర్బందం.వ్యక్తిగత పరిశుభ్రత..
ఉరుకుల పరుగుల జీవితాలు, అర్దరాత్రుల వరకు ఉద్యోగాలు,గడియ సమయం కూడా కాలీ లేకుండా గడిపాం.కనీసం కన్నవారితో,కట్టుకున్నవారితో,మనం కన్నవారితో గడిపే సమయమే దొరకలేదు.ఒక యంత్రాలుగా మాదిరిగా మారిపోయాం..ఎంత సంపాదించిన ఏదో ఒక వెలితి ఉండేది కుటుంబంతో గడపలేకపోతున్నాం..పిల్లలతో ఆడలేకపోతున్నాం..వాళ్ళను ఆడించలేకపోతున్నాం అనే వెలితి మనలో కనబడేది..కరోనా వైరస్ రాకతో దేశమంతా లాక్ డౌన్ ఐపోయింది..
విమానాలు,రైల్లు,బస్సులు,ఆటోలు ఇలా అన్ని స్థంబించాయి..రోడ్లపైకి రావద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి..కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం..ఇంట్లో ఉంటూ కుటుంబంతో గడుపుదాం..పిల్లలకు తెలియని విషయాలు తెలియజేద్దాం,వారితో చిన్నపిల్లాల్లుగా మారి ఆడుకుందాం,జీవిత బాగస్వామికి సహాయం చేద్దాం..వాళ్ళ ఒత్తిడిని దూరం చేద్దాం.అమ్మా నాన్నలతో మనసు విప్పి మాట్లాడుదాం..వాళ్ళ మంచి చెడ్డా పంచుకుందాం..
ఇలా ఇప్పుడు ఈ అవకాశం ఉంది ఇలా నువ్వు ఇంట్లో ఉండటం ద్వారానే దేశానికి సేవచేసినట్టు అవుతుంది.మన ప్రభుత్వాలు కోరేది కూడా అదే కదా..!! ఇంట్లో ఉండటం ద్వారా కరోనాను నియంత్రించచ్చు..ఇంట్లో ఉంటూ ఈ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ,నీ పిల్లలతో ఆడిపాడుతూ నీ దేశాన్ని కాపాడుకునే అవకాశం రావడం అదృష్టంగా బావించు..దాన్ని తూచా తప్పకుండా పాటించు ఇప్పుడు మనం ఇంట్లో ఉండటమే నిజమైన దేశభక్తి అవుతుంది..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు నష్టపోకూడదని ప్రత్యేక బడ్జెట్ ప్యాకేజీలు ప్రకటించారు..
కేంద్రం పించన్లు,5కిలోల భియ్యం,ఇతర వసతులు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం గౌ.ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు పెద్దమనసుతో తెల్లరేషన్ కార్డ్ గల ప్రతీ వ్యక్తికి 12 కిలోల బియ్యం,నిత్యవసర వస్తువుల ఖర్చుల నిమిత్తం 1500/- రూపాయలు అందజేసేందుకు ముందుకొచ్చారు..ఇంతే కాకుండా తెలంగాణాలో వ్యవసాయం ఎక్కువ రైతుల పంట చేతికొచ్చే సమయం,ముంచుకొచ్చిన ఈ విపత్తువల్ల రైతులు నష్టపోకూడదని రైతుల పంటను వారి ఊరిలోనే కొనేందుకు నిర్ణయం తీసుకున్నారు..ఇది చాలా గొప్ప నిర్ణయం రైతుల్లో నిజంగా కొండత దైర్యాన్ని నింపింది..
తెలంగాణా ప్రభుత్వం మొదటి నుండి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది..ముందస్తు చర్యలు చేపడుతుంది.ప్రజలను అన్నిటికి అన్నివిదాలుగా సిద్దం చేస్తుంది..60వేల మందికి కరోనా వచ్చినా సిద్దంగా ఉండేవిదంగా చర్యలు చేపట్టింది..ప్రభుత్వాలు చేసేది మన కోసం మన ఆరోగ్యం కోసం కాబట్టి వారి సూచనలు పాటించాలి..మనం ఇంట్లో ఉండటమే ఇప్పుడు మనం ప్రభుత్వాలకిచ్చే పెద్ద గౌరవం,దేశానికి చేసే సేవలాంటిది..
దేశానికి ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చిన ప్రతీసారి మన ఐక్యతను చాటాం..దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం అంటూ,దేశం కోసం పోరాడటానికి సిద్దపడ్డాం..బార్డల్లో సైనికులతో కలిసి పనిచేయడానికి సిద్దం అంటూ సోషల్ మీడియా వేదికగా గొంతువిప్పాం.. అప్పుడు మన అవసరం పడలేదు.. కానీ దేశానికి ఇప్పుడు మన దేశభక్తిని చూపెట్టే అవకాశం వచ్చింది..దేశం పై మనకు నిజమైన భక్తి,ప్రేమ ఉంటే నిరూపించుకునేందుకు సరైన సమయమిది..
దాని కోసం మనం కత్తులు,తుపాకులు,బాంబులు పట్టుకుని యుద్దం చేయాల్సిన అవసరం లేదు..పోరాటాలు చేయాల్సిన అవసరమూ లేదు..మనం చేయాల్సింది కేవలం స్వియ నియంత్రణ,స్వియ నిర్బందం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే ఇప్పుడు మనం దేశానికి ఇచ్చే బహుమానం ఇదే ఇప్పుడు మనదేశం పై మనం చూపెట్టే దేశభక్తి..మన కోసం ,మన ప్రజల కోసం,మన దేశం కోసం పగలు రాత్రి లెక్కచేయకుండా, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వైద్యులు కరోనా నివారణకు,కరోనా వ్యాది వ్యాప్తి చెందకుండా నిరంతరం నిద్రపోకుండా శ్రమిస్తున్నారు..
పోలీస్ సిబ్బంది,పారిశుద్య కార్మికులు,అదికారులు మన కోసం నిద్రహారాలు లేకుండా కష్టపడుతున్నారు..మనం.భయట తిరిగి వారికి బారమవుదామా..? లేదా మనల్ని మనం స్వియనిర్బందం పాటించి వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూద్దామా ఆలోచించండి..దేశం కోసం పోరాడే అవకాశం మనకు ఎలాగూ రాలేదు..కానీ దేశంను కాపాడటం కోసం అది కూడా ఇంట్లో ఉండి నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతూ దేశాన్ని కాపాడే అవకాశం వచ్చింది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన దేశభక్తిని చాటుదాం..ఇటలీ,అమెరికాల లాగా ప్రభుత్వాల మాట పెడచెవిన పెట్టి వాళ్ళ పరిస్థితిని మనం తెచ్చుకోకుండా,స్వియనిర్బందం,స్వియనియంత్రణ,వ్యక్తిగత పరిశుభ్రత,సామాజిక దూరం పాటిద్దాం..కరోనాని నివారిద్దాం..ప్లీజ్ దయచేసి ప్రభుత్వాలకు సహకరిద్దాం.ఇంట్లో ఉందాం..క్షేమంగా ఉందాం..
– Telangana Vijay
Warangal