డైరెక్టర్ తేజ ఇటీవల రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘అలివేలు వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’. ఇందులో మొదటి చిత్రమైన ‘అలివేలు వేంకటరమణ’ చిత్రం గురించి రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కూడా అలివేలు మంగగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయమై పలువురు హీరోయిన్‌ల పేర్లు తెరపైకి వస్తుండటం విశేషం. ముందుగా తేజ లక్కీ గాళ్ అయిన కాజల్ ఈ పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్వీటీ అనుష్కను ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నారని, దాదాపు గోపీచంద్‌తో ఆమె మరోసారి జోడి కట్టడం ఖాయం అనుకుంటున్న తరుణంలో మళ్లీ సాయిపల్లవి పేరు వినిపించింది.
అయితే సాయిపల్లవి సినిమా అంగీకరించాలంటే చాలా తతంగం ఉండటంతో ఆమె పేరు అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇప్పుడీ పాత్ర కోసం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఖాళీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్‌ని అనుకుంటున్నారు. గోపీచంద్‌తో ఆమె ఇప్పటికే ‘లౌక్యం’ అనే సినిమా చేసింది. ప్రస్తుతం తేజ తన ‘అలివేలు మంగ’గా రకుల్‌ని సెలక్ట్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే రకుల్‌ని సంప్రదించారని, కథ విన్నాక తన డెసిషన్ చెబుతానని రకుల్ అన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. ప్రస్తుతానికి చేతిలో సరైన సినిమా లేదు అలాగే తేజ సినిమాలో హీరోయిన్ పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఓకే అంటుంది. అందులో డౌటే లేదు. అయితే ఈ విషయమే అధికారిక సమాచారం చిత్రయూనిట్ నుంచి రావాల్సి ఉంది.