అటల్ బిహారీ వాజపేయి గారు భారత దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం. అధికారంలోవున్న అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు గారి ప్రధానిగా చివరి రోజు. Protocol లో భాగంగా కాబోయే ప్రదానికి కరచాలనం చేస్తూ… పీవీ నరసింహారావు గారు వాజపేయి గారి చేతిలో ఒక చీటి పెట్టి ” ఆయుధం సిద్ధంగా ఉన్నది. ఎప్పుడైనా పరీక్షించుకోవచ్చు” అని చెప్పిండు.
తదనంతరం వాజపేయి గారి ప్రభుత్వం ఫోఖ్రాన్ లో అణు పరీక్షలు, తద్వారా భారతదేశానికి అణు ఆయుధ శక్తి… ఈనాడు చైనాకు భారతదేశమంటే వెన్నులో భయమున్నది అంటే, అది పీవీ నరసింహారావు గారి initiation, దూరదృష్టి. ఒక ఆర్థిక సంస్కరణలే కాదు, దేశభద్రత గురించి భవిష్యత్తు గురించి ఎన్నో గొప్ప నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపించిన భరతమాత ముద్దుబిడ్డ.
తెలంగాణ జాతి గర్వపడే మహోన్నతమైన వ్యక్తి, గొప్ప నాయకుడు మన పీవీ నరసింహారావు గారు. ఈ మహోన్నతమైన వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలతో దాచిపెట్టబడ్డాడు.