డీజిల్ ధరలు కొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ కూడా ఇంధన ధరలను పెంచారు.గత మూడు వారాల్లో డీజిల్ ధర పెరగడం ఇది 22వ సారి.
దీంతో లీటరు డీజిల్‌పై రూ.11.14 పైసలు పెరిగాయి. సోమవారం రోజున లీటరు పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 80.43పైసలు కాగా, లీటరు డీజిల్ ధర 80.53 పైసలుగా మారింది. స్థానిక సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు మారుతాయి.