Home / SLIDER / గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన శిల్పారెడ్డి

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన శిల్పారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఈ రోజు తన నివాసంలో మూడు మొక్కలను నాటారు.

శిల్పారెడ్డి మాట్లాడుతూ…చెట్లను నాటడం అనేది మానవ జీవితంలో ఒక భాగం ఇలా మనం మాత్రమే చెట్లను నాటడం కాకుండా మన ఇంట్లో వాళ్ళందరిని అలాగే చుట్టూ పక్కల వారిని బంధు మిత్రులను ఇందులో భాగస్వామ్యం చేస్తే రాబోవు తరాల వారికి ఒక గొప్ప బహుమతి ఇచ్చిన వల్లమౌతామన్నారు.

అలాగే నాటిన ప్రతీ మొక్కను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే అది భవిష్యత్ తరానికి బాసటగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇంతటి గొప్ప కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ గారికి అలాగే సినీనటి సమంత కు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా శిల్పారెడ్డి మరో నలుగురిని గ్రీన్ ఛాలెంజ్ కి నామినేట్ చేశారు.అందులో అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల,సుస్మిత కొణిదెల,మంచు లక్ష్మీ అలాగే సామ్రాట్ రెడ్డి ఉన్నారు.