రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన అక్కలు రాఖీ కట్టారు.
ప్రగతిభవన్‌కు సోమవారం వచ్చిన సీఎం అక్కలు లలితమ్మ, సకలమ్మ, లక్ష్మీబాయి, వినోదమ్మ ఆయనకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్ కట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నదమ్ములు అక్కాచెల్లెండ్ల ప్రేమ, అనురాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు.