Home / SLIDER / 108, 104 అంబులెన్స్ లకు శానిటైజర్ స్ప్రేయర్లను పంపిణి చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్

108, 104 అంబులెన్స్ లకు శానిటైజర్ స్ప్రేయర్లను పంపిణి చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్

వరంగల్ రూరల్ జిల్లాలో సేవలు అందిస్తున్న 108, 104 అంబులెన్స్ వాహనాలకు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా 16 శానిటైజర్ స్ప్రేయింగ్ మిషన్ లను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు పంపిణి చేశారు.

నిత్యం కరోనా బాధితులను తరలిస్తున్న అంబులెన్స్ వాహనాలకు శానిటైజేషన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి రూరల్ జిల్లాలో సేవలు అందిస్తున్న 16 అంబులెన్స్ వాహనాలకు ఆరూరి గట్టుమల్లు ఫాండషన్ ద్వారా శానిటైజర్ స్ప్రేయర్లను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, ఆరూరి విశాల్, జాగృతి నాయకులు కోరబోయిన విజయ్, 53వ డివిజన్ ప్రెసిడెంట్ పోలపల్లి రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.