Home / MOVIES / బిగ్ బాస్-4 లో గంగవ్వ

బిగ్ బాస్-4 లో గంగవ్వ

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇళ్ల‌కే ప‌రిమిత‌మైన చాలా మందికి ఇప్పుడు బిగ్‌బాస్ మంచి టైమ్ పాస్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో యూ ట్యూబ్ స్టార్‌ గంగ‌వ్వ కూడా బిగ్‌బాస్ 4లో పాల్గొన‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

మై విలేజ్ షోతో గంగ‌వ్వ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. తెలంగాణ యాస‌లో మాట్లాడే గంగ‌వ్వ స‌మంత‌, కాజ‌ల్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్‌ను కూడా ఇంట‌ర్వ్యూ చేశారు.

ఈమెను సీజ‌న్‌4కు నిర్వాహ‌కులు ఎంపిక చేశార‌నే వార్త‌లు ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఒక‌వేళ ఈ వార్త‌లు నిజం అయితే ఇంత పెద్ద వ‌య‌సున్న కంటెస్టెంట్‌ను నిర్వాహ‌కులు ఎంపిక చేయ‌డం ఇదే తొలిసారి అవుతుంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri