తెలంగాణ
రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమై ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది:
• ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ని ఆమోదించింది
• ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది
• తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది
• పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లును ఆమోదించింది
• తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లును ఆమోదించింది
• తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020ని ఆమోదించింది
• ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 ను కేబినెట్ ఆమోదించింది
• ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002ని ఆమోదించింది
• ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను ఆమోదించింది
• టిఎస్ బిపాస్ బిల్ ను ఆమోదించింది
• తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు-1956 సవరణ బిల్లును ఆమోదించింది
• ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు-1972కు సవరణ బిల్లును ఆమోదించింది
• కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది
• కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది
• 17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది
కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.