తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. సమావేశాలకు వస్తున్న సభ్యులు కరోనా బారిన పడుతున్నారు.
దీంతో వర్షాకాల సమావేశాలు కొనసాగించే అంశంపై చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో మండలి చైనర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు.
సమావేశాల కుదింపుపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై మరోమారు పార్టీల అభిప్రాయం తీసుకువాలని నిర్ణయించారు.*