ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో వైరస్ అలజడి రేపుతోంది. తాజాగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్ రాగా.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రెండోసారి వైరస్ బారినపడ్డారు.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,944 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,292 మందికి పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,39,719కి పెరిగింది. తాజాగా చిత్తూరు జిల్లాలో అత్యధకంగా 784 కేసులు నమోదయ్యాయి.
తూర్పుగోదావరిలో 652, ప్రకాశంలో 591, గుంటూరులో 493, కృష్ణాలో 399 కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో మరో 6,102 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకూ 6.84 లక్షల మంది డిశ్చార్జ్ కాగా 48,661 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గురువారం 42 మంది కరోనాతో మరణించారు.