Home / SLIDER / మంత్రి హారీష్ రావు ఫోటో వైరల్.. అసలు కారణం ఇదే..!

మంత్రి హారీష్ రావు ఫోటో వైరల్.. అసలు కారణం ఇదే..!

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ ఫోటో ఎందుకు వైరల్ అవుతుందో ఒక లుక్ వేద్దాం. వచ్చే నెల నవంబర్ మూడో తారీఖున దుబ్బాక ఉపఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరపున రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హారీష్ రావు దుబ్బాకలోని పదకొండు వార్డు లచ్చపేటలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిద్ధిరాములును మంత్రి పరామర్శించారు. అనంతరం మంత్రి హారీష్ నడుచుకుంటూ వస్తుండగా మధ్యలో బీడీలు చుడుతున్న మహిళల వద్దకెళ్లారు.

అక్కడ వాళ్లతో ముచ్చటించారు. అమ్మా బాగున్నారా.. ఆసరా ఫించన్ వస్తుందా అని వాళ్లను ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు వాళ్లు సంతోషంతో వస్తుంది అని సమాధానం ఇచ్చారు. ఈఫోటోపై సోషల్ మీడియాలో హారీష్ రావు జననేత.. పేదోళ్ళ నాయకుడు… జనం నుండి పుట్టుకొచ్చిన నాయకుడని తెగ వైరల్ అవుతుంది. మంత్రి హారీష్ ఫోటో వైరల్ వెనక అసలు కారణం ఇదే.