Home / SLIDER / దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం!

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం!

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మించనున్నారు. త్వరలోనే ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఢిల్లీలోని వసంత విహార్‌లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం కేటాయించింది.

ఈమేరకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడికి కేంద్ర హౌసింగ్‌, పట్టణ మంత్రిత్వ శాఖ అధికారి దీన్‌దయాళ్‌ లేఖను పంపారు. స్థలం కేటాయింపు పూర్తయిన నేపథంలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయడంతోపాటు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.