Home / SLIDER / జియో సంచలనం

జియో సంచలనం

టెలికాం రంగంలో జియో రిలయన్స్ మరో సంచలనం సృష్టించింది. జూలై నెలలో కొత్తగా జియో నెట్ వర్క్ ను దాదాపు ముప్పైదు లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో మొత్తం నలబై కోట్ల మంది వినియోగదారులు గల సంస్థగా జియో అవతరించింది.

ప్రారంభించిన ఐదేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. అయితే ఎయిర్ టెల్ కు 15.5కోట్లు,వోడాఫోన్ -ఐడియా కు 11.6కోట్లు,బీఎస్ఎన్ఎల్ కు 2.3కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం మీద దేశం వ్యాప్తంగా 116.4కోట్ల మంది టెలికాం సబ్ స్క్రైబర్లు ఉన్నారని ట్రాయ్ ప్రకటించింది.