Home / MOVIES / టాలీవుడ్ హాట్ భామకు సరికొత్త అవకాశం

టాలీవుడ్ హాట్ భామకు సరికొత్త అవకాశం

అనూ ఇమ్మాన్యుయేల్‌కి మరో అవకాశం వచ్చింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’లో ఆమె ఓ కథానాయికగా ఎంపికయ్యారు.

ఇంతకు ముందు అదితీరావ్‌ హైదరిని కథానాయికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కథలో ఇద్దరు నాయికల పాత్రలకూ ప్రాముఖ్యం ఉంటుందని దర్శకుడు తెలిపారు.

ఇంటెన్స్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.