Home / SLIDER / మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవం

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవం

తెలంగాణ రాష్ట్రంలోని పేద‌ల‌కు తెలంగాణ ప్రభుత్వం ద‌‌స‌రా బ‌హుమ‌తి అందించ‌నుంది. స‌క‌ల వ‌స‌తుల‌తో నిర్మించిన డ‌బ‌ల్ బెడ్‌రూమ్ ఇండ్ల‌ను ఈరోజు ప్రారంభించ‌నుంది. హైద‌రాబాద్‌లోని మూడు చోట్ల ఇవాళ ఉద‌యం మూడుచోట్ల డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించ‌నున్నారు.

ఉద‌యం 10 గంట‌ల‌కు జియాగూడ‌లోని 840 ఇండ్ల‌ను, 11 గంట‌ల‌కు గోడే కి క‌బ‌ర్‌లో 192 ఇళ్ల‌ను, 11.30 గంట‌ల‌కు క‌ట్టెల మండిలో 120 డ‌బ‌ల్ బెడ్‌రూమ్ ఇండ్ల‌ను ప్రారంభిస్తారు. మొత్తంగా మూడు చోట్లా క‌లిపి 1,152 ఇళ్ల‌ను ల‌బ్దిదారుల‌కు కేటాయించ‌నున్నారు.

ఇళ్ల ప్రారంభోత్స‌వంలో ఉప‌స‌భాప‌తి టీ ప‌ద్మారావు, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ, మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ప్ర‌శాంత్‌రెడ్డి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పాల్గొన‌నున్నారు.