‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాఖీఖన్నా కెరీర్లో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఊహాలు గుసగుసలాడే చిత్రంలో సాయి శిరీష ప్రభావతిగా నటించగా, ఈ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ‘ప్రతిరోజూ పండగే’లో టిక్‌టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన రాశీ.. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
ప్రతి పాత్రలోనూ కాస్త హాస్యాన్ని జోడించి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. అందం, అభినయం ఈ రెండూ కలిగిన సక్సెస్ఫుల్ యాక్ట్రెస్‌గా రాణిస్తోంది. అయితే లాక్డౌన్ తర్వాత వరుస ఫోటో షూట్ లు చేస్తున్న రాశీ ఖన్నా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఇందులో చీరకట్టులో ద్విగుణీకృతమైన అందంతో కనిపిస్తుంది. ఆమె అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.