తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తున్నది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు ఫిల్మ్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌ను నిర్మించనున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా వెల్లడించారు.
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల బృందం బల్గేరియా వెళ్లి అక్కడి సినిమాసిటీని పరిశీలించి రావాలని సూచించారు.
ఆ తరువాత ‘సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనందున సినిమా షూటింగులు, థియేటర్లు పునఃప్రారంభించవచ్చని సీఎం ప్రకటించారు. సినీరంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున శనివారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి – విస్తరణపై చర్చ జరిగింది. వారినుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో చిత్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో అటు షూటింగులు ఆగిపోయి, ఇటు థియేటర్లు నడువక అనేకమంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
Post Views: 500