తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నగరంలోని ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దాపురం కృష్ణగౌడ్ ఈ నెల 18 బీజేపీలో చేరనున్నారు.
ఫతేనగర్‌లో జరిగే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర సహాయక మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్, సీనియర్ నాయకులు గరికపాటి రామ్మోహన్‌రావు, పెద్ది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.