గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం తమదేనని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం ముగిసింది.
భేటీ ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి చిత్రపటానికి సీఎం నివాళి అర్పించారు. అంతా కాసేపు మౌనం పాటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.