Home / Tag Archives: GHMC

Tag Archives: GHMC

తెలంగాణలో కొత్త‌గా 1,798 క‌రోనా కేసులు

 తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,798 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 14 మంది మృతి చెందారు. 2,524 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 23,561 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,30,430 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

Read More »

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవఖానాలపై కొరడా

క‌రోనా సంక్షోభంలో డ‌బ్బే ప‌ర‌మావ‌ది కాకుండా మానవతాదృక్పథంతో వ్య‌వ‌హరించి రోగుల‌కు చికిత్స అందించాల్సిందిగా ప్ర‌భుత్వం ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేసింది. అయినా పెడ‌చెవిన పెట్టి కొవిడ్ చికిత్స‌కు ఇష్టానుసారం అధిక ఫీజులు వ‌సూళ్లు చేస్తున్న ప‌లు ప్రైవేటు ఆస్ప‌త్రులపై ప్ర‌భుత్వం తాజాగా కొర‌డా ఝుళిపించింది. ప్ర‌జ‌ల నుంచి అందిన ఫిర్యాదుల మేర‌కు 64 ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వైద్యారోగ్య‌శాఖ‌ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన ఆస్ప‌త్రుల …

Read More »

జీహెచ్ఎంసీలో తొలిరోజు 21, 666 మందికి టీకా

 గ్రేటర్‌ హైదరాబాద్‌లో శుక్రవారం మొదటిరోజు స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. హైరిస్క్‌ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేశారు. ముందస్తుగా 30 వేల మందికి టోకెన్లు అందించగా.. 21,666 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వీరిలో 44 ఏండ్లలోపు వయస్సువారు 15,963 మంది, 45 ఏండ్లు పైబడివారు 5,703 మంది ఉన్నారు. మొదటి …

Read More »

డాక్టర్లపై దాడి – కేసు నమోదు -అరెస్టు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ‘విరించి’ ఆసుపత్రిలో తమ బందువు కు సరైన చికిత్స అందించక పోవడం మూలంగా వ్యక్తి మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మే కారణమని మృతుని బంధువులు, స్నేహితులు కొందరు ఆసుపత్రి సిబ్బంది తో వాగ్వాదం కు దిగారు . పంజాగుట్ట పోలీసులు విషయం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వారిని వారించెందుకు యత్నించారు.అవేశంతో వుగిపోయిన మృతుని బంధువులు ఆసుపత్రి లో …

Read More »

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 21 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,146 మంది మరణించారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,13,968కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 424 నమోదయ్యాయి.

Read More »

ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ సామల

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని సీతాఫలమండి లో ఆశా వర్కర్లు గా పని చేస్తున్న వారికి కార్పొరేటర్ హేమ సామల గారి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారు హాజరై ఆశా వర్కర్లు కి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ …

Read More »

GHMCలో కరోనా కట్టడీపై ఇంటింటి సర్వే

తెలంగాణలో కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి స‌ర్వే బుధ‌వారం కూడా కొన‌సాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబితాను సిబ్బంది న‌మోదు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు చెందిన క్షేత్రస్థాయి కార్మికులతో కూడిన మొత్తం 707 బృందాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41,305 ఇండ్ల‌ను సర్వే చేశాయి. కొవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఈ బృందాలు 19,090 మందిని బస్తీ …

Read More »

గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్

గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.

Read More »

GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  GHMC పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,464 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 95,919 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు …

Read More »

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కల్లోలం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 989 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 93,450 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Read More »