చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు హనీమూన్ పీరియడ్‌లో ఉంది. హనీమూన్‌లో ఉన్నప్పటికీ కాజల్ అగర్వాల్ తన బ్రాండ్ వేల్యూని భర్త కోసం ఉపయోగిస్తుంది.
కాజల్ భర్త గౌతమ్ ప్రముఖ డిజైనింగ్ కంపెనీ అధినేతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బిజినెస్ వ్యవహారంలో ఇప్పుడు భర్తకు తోడుగా కాజల్ కూడా చేరింది. గౌతమ్ కిచ్లుకి సంబంధించిన ఇ కామర్స్ సంస్థ డిస్కర్న్ లివింగ్‌కి కాజల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
ఈ సంస్థ బ్రాండ్ పబ్లిసిటీ బ్రోచర్స్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కాజల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు కమల్ హాసన్ ఇండియన్ 2.. డీకే దర్శకత్వంలో ఓ హారర్ మూవీలో కాజల్ నటించాల్సి ఉంది.