వ‌్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌నగర్ వద్ద బూర్గుల టోల్‌గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్‌లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
