తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ఉద్యమంలా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ మేరకు ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు ఇతర శాఖల్లో ఖాళీగాఉన్న అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఇందుకోసం అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని సూచించారు.