తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో టాలీవుడ్ కి చెందిన క్యూట్ ముద్దుగుమ్మ.. బక్కపలచు భామ సాయిపల్లవి రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పాన్ అమెరికా మూవీగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేతృత్వంలో తెరకెక్కనున్న “సలార్” మూవీలో సాయిపల్లవి నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటించే అవకాశం ఉంది.ఇందులో రెండో పాత్రకు సాయిపల్లవి ఖరారైందని టాక్.ఇందులో ఇంకా దగ్గుబాటి రానా ,మోహన్ లాల్ నటించనున్నారు.