యువహీరో నితిన్ హీరోగా రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం చెక్. వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్’ అని టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల చేశారు.
ఇందులో నితిన్ ఖైదీగా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఉరిశిక్ష పడిన ఖైదీ జీవిత నేపథ్యంలో చెక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుండగా, మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కానుంది.