Home / MOVIES / KGF ఛాప్టర్ 2 టీజర్ కొత్త రికార్డు

KGF ఛాప్టర్ 2 టీజర్ కొత్త రికార్డు

ఇండియన్ సినిమా రేంజ్ ఇది అంటూ దూసుకుపోతున్న‌ది కేజియఫ్ 2 టీజర్. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ హీరోగా నటిస్తున్న కేజిఎఫ్ 2 టీజర్ త‌న  పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది.   బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇదే.   కేజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 48 గంటల్లోపే ఈ చిత్రం 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు 5.5 మిలియన్స్ కు పైగా లైకులు కూడా సంపాదించింది.

2 నిమిషాల 16 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ చూస్తుంటే చాప్టర్-2 ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తొలి భాగానికి 10 రెట్లు అదిరిపోయేలా చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే విడుదలైన క్షణం నుంచి ఈ ట్రైలర్ చరిత్ర సృష్టిస్తోంది. నిజానికి జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ ముందు రోజు రాత్రి ట్రైలర్ లీక్ అయింది. దాంతో జనవరి 7 రాత్రి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. విడుదలైన 48 గంటల్లోపే 100 మిలియన్స్ సాధించింది.

ఇప్పటికీ ఈ టీజర్ దూకుడు కొన‌సాగుతోంది.   జోరు చూస్తుంటే కచ్చితంగా 200 మిలియన్ క్రాస్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. కొన్ని ప్యాచ్ వర్క్ మినహా సినిమా అంతా అయిపోవడంతో విడుదల తేదీ ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. అన్ని కుదిరితే మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కే జి ఎఫ్ 2 ఒకేరోజు విడుదల కానుంది. ఈ సినిమా దాదాపు 230 కోట్ల బిజినెస్ చేస్తుంది. తెలుగులో కూడా దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. హిందీలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరుగుతుంది. అన్ని ఇండస్ట్రీల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.