తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై కొత్త వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ మధ్య ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపించాయి. తాజాగా ‘చౌడప్పనాయుడు’ పేరు తెరపైకి వచ్చింది.
ఈ టైటిల్ ను చిత్రబృందం పరిశీలిస్తోందని ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.