Home / MOVIES / వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్

వైరల్ అవుతున్న పవన్ న్యూ లుక్

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ఇప్పుడు వ‌కీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ  సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవ‌ల క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చారిత్రాత్మ‌క చిత్రంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రీమేక్ మూవీని కూడా మొద‌లు పెట్టాడు.

సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో రానా ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు. ప‌వ‌న్, రానా మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందిస్తాయ‌ని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ప‌వ‌న్ తాజాగా పంచె క‌ట్టులో మెరిసారు.

కార్ వ్యాన్ నుండి పంచె ధరించి వ‌స్తున్న ప‌వ‌న్ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ లుక్‌లో ప‌వ‌న్‌ని చూసిన అభిమానులు  తెగ మెరిసిపోతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat