Home / ANDHRAPRADESH / ‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి

‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను మేఘా ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ తో ప్రకాశం, కడప జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ఇక వెలిగొండ సొరంగ మార్గం కోసం ఎంఈఐఎల్ సంస్థ అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ను వినియోగించింది. కరోనా, ఇతర అవరోధాలను ఎదుర్కొని రికార్డు సమయంలో 3.6 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేసింది. ఎంఈఐల్ సంస్థ రాత్రింబవళ్లు కష్టపడి 9.23 మీటర్లు తవ్వడం ద్వారా ఈ పనులు పూర్తి చేసింది. రెండో సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూల సుబ్బయ్య వెలిగొండ మొదటి సొరంగం పూర్తి పొడవు 18 కిలోమీటర్లు.

ఒక్కో టన్నెల్ పొడవు 18 కిలోమీటర్లు ఉండగా శ్రీశైలం అభయారణ్య రక్షణ కోసం టిబిఎం – టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా సొరంగాల తవ్వకం చేపట్టారు. అత్యంత అరుదుగా టిబిఎంను వినియోగిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా వెలిగొండ ప్రాజెక్ట్ లోనే వినియోగించారు. ఇక ప్రాజెక్ట్ కోసం ఆసియాలో పొడవైన కన్వేయర్ బెల్ట్ వినియోగిస్తోంది, 18 కిలోమీటర్లు టన్నెల్ లోకి కన్వేయర్ బెల్ట్ వెళ్లేందుకు రెండుగంటలు పడుతుంది. టన్నెల్ లో 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిలోనూ పనులు చేస్తున్న మేఘా సిబ్బంది. కరోనా, వర్షాలును సైతం తట్టుకొని మేఘా దాదాపు 10 మీటర్ల చొప్పున తవ్వారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండో సొరంగ మార్గం పనులు సైతం ఊపందుకున్నాయి.

ఈ సొరంగం మార్గం ద్వారా 3001 క్యూసెక్స్ (85 క్యూమెక్స్) నీటిని తరలించనున్నారు. దేశంలోని పెద్ద గురుత్వాకర్షణ సొరంగాలలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 1.20 లక్షల ఎకరాల ఆయకట్ కు నీటి సరఫరాతో పాటు 4 లక్షల మంది ప్రజల అవసరాలు తీరనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat