కేజీఎఫ్ అనే కన్నడ చిత్రం దేశ వ్యాప్తంగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 200 కోట్ల వసూళ్ళు రాబట్టి అందరి దృష్టి ఆకర్షించింది.
ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 మూవీపై కూడా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 16న ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమాకు సంబంధించి భారీగా బిజినెస్ జరుగుతుంది.
మరోవైపు కేజీఎఫ్ 2 సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, రాఖీ భాయ్ యష్ అభిమాని ఒకరు రిలీజ్ రోజున సెలవు కావాలంటూ మోదీకు లేఖ రాసారు.
దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల ఫీలింగ్స్‌ను అర్ధం చేసుకొని జూలై 16ని సెలవు దినంగా ప్రకటించండి అంటూ తన లేఖలో పేర్కొన్నారు. అభిమాని రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.కాగా, యష్ బర్త్‌డే రోజు విడుదలైన కేజీఎఫ్ 2 టీజర్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.