ప్రస్తుతం చాలా మంది బాత్రూంలోకి మొబైల్స్ తీసుకెళ్తున్నారా ? ఈ మధ్య చాలామందికి బాత్ రూంలోకి మొబైల్స్ తీసుకెళ్లడం వ్యసనంగా మారిపోయింది. అయితే మొబైల్ ఫోన్ బాత్రూంలోకి తీసుకెళ్లే అలవాటు అనారోగ్యాన్ని మోసుకొస్తుంది.
మొబైల్ తో బాత్రూమ్లో కూర్చున్నప్పుడు, ఫోన్ పైన పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఈ కారణంగా సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్ లోనే కూర్చుంటారు. దీి వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఇకనైనా మొబైల్ ఫోన్ ను టాయిలెట్ లోకి తీసుకెళ్లడం ఆపేయండి.