Home / HYDERBAAD / మ‌. 12:30 గంట‌ల‌కు GHMC మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక

మ‌. 12:30 గంట‌ల‌కు GHMC మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక

గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(జీహెచ్ఎంసీ)కు నూత‌నంగా ఎన్నికైన కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం పూర్తయింది. ఇక మిగిలింది మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నికే. ఈ ప్ర‌క్రియ‌ను మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి తెలిపారు.

మొత్తం 193 మందికి గాను 97 మంది స‌భ్యులు ఉంటేనే ఎన్నిక ప్ర‌క్రియ నిర్వ‌హించ‌నున్నారు. ఏ అభ్య‌ర్థికి ఎక్కువ మంది చేతులెత్తి మ‌ద్ద‌తు తెలుపుతారో వారినే మేయ‌ర్‌గా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇదే విధానం డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు కూడా ఉంటుంది.

పార్టీల బ‌ల‌బ‌లాలు..

ఇక పార్టీల వారీగా బలబలాలను పరిశీలిస్తే.. 150 డివిజన్లలో 56 స్థానాలను గెలిచి అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరించింది. బీజేపీకి 48, ఎంఐఎంకు 44,  కాం గ్రెస్‌ రెండు డివిజన్లకు గెలుచుకున్నది. లింగోజిగూడ కార్పొరేటర్‌ రమేశ్‌ కరోనాతో మరణించారు. దీంతో 149 సభ్యులకు కౌన్సిల్‌ పరిమితమైంది. ఈ క్రమంలోనే మేజిక్‌ ఫిగర్‌ 97కి చేరింది. ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో సభ్యుల మద్దతు కీలకంగా మారింది. టీఆర్‌ఎస్‌కు 32 ఎక్స్‌ అఫీషియో కలిసి 87 మంది బలం ఉంది. బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు, ఇద్ద రు ఎక్స్‌ అఫీషియోలతో కలిసి 49గా ఉంది. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో 10తో కలిపి 54 మంది బలం ఉంది. కాంగ్రెస్‌కు ఇద్దరు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నా రు. బీజేపీ, ఎంఐఎం పార్టీల వ్యూహాం ఎలా ఉన్నా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌కు నల్లేరు మీద నడకలాంటిదేనని చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat